Chittoor DIG: మొత్తం చేసింది వాళ్లే... పుంగనూరు అల్లర్లపై డీఐజీ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-05T13:41:14+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో చెలరేగిన అల్లర్లపై డీఐజీ అమ్మిరెడ్డి వివరణ ఇచ్చారు.

Chittoor DIG: మొత్తం చేసింది వాళ్లే... పుంగనూరు అల్లర్లపై డీఐజీ వ్యాఖ్యలు

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) పర్యటన సందర్భంగా పుంగనూరులో చెలరేగిన అల్లర్లపై డీఐజీ అమ్మిరెడ్డి (DIG Ammireddy) వివరణ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అల్లర్లు, పోలీసులపై దాడి ప్రీ ప్లాండ్ అని.. కుట్ర దాగి ఉందన్నారు. అనుమతి పొందిన రూట్‌లో కాకుండా రూట్ మార్చుకోవడమే అల్లర్లకు ప్రధాన కారణమన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలిసులపై ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారని తెలిపారు. ప్రజల మాన ప్రాణాలను కాపాడుతున్న పోలీసులను వెంటబడి వెంటబడి కొట్టారన్నారు. పుంగనూరు టీడీపీ ఇంచార్జి చల్లా బాబు సూచన మేరకే రూట్ మార్చడం, అల్లర్లు ప్రేరేపణ జరిగాయని చెప్పారు. మొత్తం అల్లర్లలో పోలీసులకే తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దాదాపు 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, సుమారు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు నలభై మందిని అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. పుంగనూరు అల్లర్లపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేసు విచారణ కొనసాగుతోందని.. పరిస్థితులను బట్టి పరిశీలిస్తామని డీఐజీ అమ్మిరెడ్డి వెల్లడించారు.


ఎస్పీ మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలు ఏ వన్ ముద్దాయి పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చెల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని అన్నారు. నిన్నటి (శుక్రవారం) సంఘటనలో ఇప్పటి వరకు ఒక ఎఫ్ఆర్ఐ నమోదు చేయడం జరిగిందని.. 307 కింద ఎఫ్ఆర్ఐ నమోదు అయ్యిందని తెలిపారు. నిన్న ఉదయం జరిగిన వైసీపీ ర్యాలీకి ముందస్తు అనుమతి ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోలీసుల అనుమతి తీసుకుని వారి కార్యక్రమాలు జరపొచ్చన్నారు. ఇంత తీవ్రమైన అల్లర్లు జరిగినా, పెద్ద పెద్ద బండ రాళ్ళతో పోలీసులను కొట్టినా వారు ఎక్కాడా సంయమనం కోల్పోలేదన్నారు. ఒక్క పౌరిడికి కూడా రాళ్ళ దెబ్బలు తగలకుండా, సాధారణ పౌరిడి ఆస్ధి నష్టం కలగకుండా పోలీసులే కాపాడి, అల్లరి మూకల దగ్గర దాడికి గురయ్యారని తెలిపారు. అల్లరి మూకలు సుమారు మూడు వేలమంది ఉన్నారని... పోలీసులు సంయమనం కోల్పోయి ఫైరింగ్ స్టార్ట్ చేసి ఉంటే పరిస్ధితి ఏంటి అని ఎస్పీ అన్నారు.

Updated Date - 2023-08-05T13:41:14+05:30 IST