JC Prabhakar: అన్నీ పీక్కున్నారు... పుట్టగొసి మాత్రమే ఉంది... పోలీసులపై జేసీ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-08-23T10:36:51+05:30 IST

పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

JC Prabhakar: అన్నీ పీక్కున్నారు... పుట్టగొసి మాత్రమే ఉంది... పోలీసులపై జేసీ ఆగ్రహం

అనంతపురం: పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి (Tadipatri Muncipal Chairman JC Prabhakar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల కోసం ఎస్పీలు పనిచేస్తారా అంటూ మండిపడ్డారు. రూ.25 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవర్ని ఉద్దరించడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారన్నారు. ‘‘ఆస్తులు అన్నీ పోయాయి.. అన్నీ పీక్కున్నారు... పుట్టగొసి మాత్రమే ఉంది. 2+2 గన్ మెన్ లను తీసివేసి 1+1 పెడుతారా... చంపుతారా చంపండి. నాలో ఫైటింగ్ స్పిరిట్ ఉంది... తాడిపత్రి కోసం ప్రాణం ఇస్తాను. ఏ కేసు అయినా ఎస్సీ కేసు... ఏదో ఒక రోజు అనుభవిస్తారు. పీడీ యాక్ట్ పెట్టు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా. దరిద్రం నా కొడుకు మాటలు వింటారా... నా ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నానా. ఎవడో ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారు....76 కేసులు అయినాయి 77కేసులు అవుతాయి. ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్. ఐపీస్‌లు అయ్యారు.. ఎందుకిలా అయ్యారు. సర్వే చేయడానికి 1600లు కట్టినా... సర్వే చేస్తే అయ్యేదానికి రూ.25 లక్షలు ప్రజల సొమ్ము ఖర్చు చేశారు. ప్రహరీగోడను కూల్చి వేస్తాం... వదిలిపెట్టేది లేదు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డిని సంతృప్తి పరచడంకోసం ఏమి చేస్తారో చేయండి. డీఎస్పీ గంగయ్య నీ బండారం బయట పెడుతా... నీ సంగతి అంతా నాకు తెలుసు. మేం అంటే నీకు మొదటి నుంచి సరిపోదు... నీకు ఎక్కడి నుంచి ఎంత వస్తుందో అంతా బయట పెడుతా. రిజిస్టర్ పోస్ట్ చేస్తే డిఎస్పీ రెఫ్యూస్ చేస్తావా. గంగన్న మీకు భయపడేది లేదు. నేను లా ఓబిడియంట్... మట్కా డబ్బులు ఎమ్మెల్యేకు నీకు ఎవరెవరికి ఎంత పోతున్నాయో చెప్తా. సేవ్ ఆంధ్ర కోసం పని చేయండి.... మీకు చేతకాకపొతే సెలవు పెట్టి వెళ్లిపోండి. మూడు నాలుగు రోజుల్లో అందరిపైనా కేసులు పెడుతా... ఎవరెవరు ఏమి చేస్తున్నారో వాళ్ళందరిని విడిచిపెట్టేది లేదు. మీ లాంటి ఐఏఎస్, డీఎస్పీల వల్లే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యల వల్ల కాదు. మీ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆయన భార్యను రక్షించుకోలేక పోతున్నారు. ఇన్సూరెన్స్ వున్నా... వైద్యం కోసం బెగ్గింగ్ చేస్తారా. తాడిపత్రి ఎమ్మెల్యే మా తహసీల్దార్‌ను కొట్టాడు... చెప్పుకోలేని పరిస్థితి తహసీల్దార్ ది. ఎవరికీ భయపడేది లేదు... ఇసుకను బంద్ చేయండి లేకుంటే ఏమి అవుతోంది చూడండి. సబ్ రిజిస్టర్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు... ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’’ ’’ అంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-23T10:38:38+05:30 IST