Lokesh YuvaGalam: నారా లోకేష్ భుజాలకు గాయాలు.. కారణమిదే..

ABN , First Publish Date - 2023-03-18T11:34:56+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్‌‌ భుజాలకు గాయాలయ్యాయి.

Lokesh YuvaGalam: నారా లోకేష్ భుజాలకు గాయాలు.. కారణమిదే..

శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్‌‌ (TDP Leader Nara Lokesh) భుజాలకు గాయాలయ్యాయి. నిన్నటి రోజున ఒకవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) వీడ్కోలు కార్యక్రమం.... మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో (Anantapur District)కి పాదయాత్ర ప్రవేశించడంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే కార్యకర్తల ఒత్తిడిలో లోకేష్ భుజాలకు గాయమైనట్లు (Injuries to Lokesh's shoulders) సమాచారం. రెండు భుజాలకు గాయం కారణంగా సెల్ఫీలు కూడా తీసేందుకు వీలుకాకపోవడంతో ఇతరుల సహాయంతో లోకేష్ సెల్ఫీలు తీయిస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రానికి డాక్టర్లు చేరుకుని లోకేష్‌కు వైద్యం అందించనున్నారు.

మరోవైపు కదిరి నియోజకవర్గం చీకటిమానుపల్లి కేంద్రం నుంచి 46వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ప్రారంభమైంది. నిన్న లోకేష్ యువగళం పాదయాత్ర (YuvaGalam) ఉమ్మడి అనంతరం జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు పాదయాత్ర సాగగా.. 46వ రోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కదిరి నియోజకవర్గం చీకటి మానుపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) మొదలైంది. నిన్న సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా లోకేష్‌ (NaraLokesh)కు టీడీపీ శ్రేణులు భారీగా ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 587 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. చీకటి మానుపల్లి విడిది కేంద్ర వద్దకు భారీగా చేరుకున్న కదిరి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు లోకేష్‌తో సెల్ఫీల కోసం బార్లు తీరిన పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-03-18T11:34:56+05:30 IST