Draupadi Murmu: రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి ముర్ము

ABN , First Publish Date - 2022-12-28T11:36:53+05:30 IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.

Draupadi Murmu: రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి ముర్ము

భద్రాద్రి కొత్తగూడెం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) భద్రాద్రి రామయ్య (Bhadrachalam Temple)ను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ వేద పండితులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపిక శాలువాతో రాష్ట్రపతిని ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు.

అనంతరం రామాలయంలో ఏర్పాటు చేసిన ప్రసాద్ పథకంలో భాగంగా సుమారు రూ.41 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై సౌందరాజన్ (Telangana Governor Tamilisai Soundarajan) , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Central Government Kishan Reddy), రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ (Telangana Ministers Allola Indrakaran Reddy, Puvwada Ajay Kumar, Satyavathy Rathore), మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత (Mahbubabad MP Malot Kavitha), రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Rajya Sabha Members Vadviraju Ravichandra), ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (Government Whip Rega Kantha Rao), జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య (ZP Chairman Koram Kanakaiah), ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (MLC Tatha Madhusudan), భద్రాచలం శాసనసభ్యులు పొదెంవీరయ్య (, Bhadrachalam MLA Podemveeraiah), జిల్లా కలెక్టర్ అనుదీప్ (District Collector Anudeep) పాల్గొన్నారు.

Updated Date - 2022-12-28T11:43:49+05:30 IST