Komatireddy Venkatreddy: ఎన్నికలకు ముందు రాజకీయాలపై మాట్లాడుతా

ABN , First Publish Date - 2022-12-16T14:20:58+05:30 IST

ఎన్నికలకు ముందు రాజకీయాలపై మాట్లాడుతానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Komatireddy Venkatreddy: ఎన్నికలకు ముందు రాజకీయాలపై మాట్లాడుతా

న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు రాజకీయాలపై మాట్లాడుతానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Congress MP Komatireddy VenkatReddy) అన్నారు. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime minister Narendra Modi)తో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనేది చెప్తానన్నారు. ప్రస్తుతం రాజకీయాలపై మాట్లాడనని... ఎన్నికలకు ఒక నెల ముందు మాట్లాడుతానని తెలిపారు. ప్రధానితో చర్చించిన కొన్ని అంశాలు చెప్పలేనని ఆయన అన్నారు. కమిటీలో చోటు దక్కలేదని బాధలేదన్నారు. మంత్రి పదవి లెక్క చేయలేదని... తెలంగాణ కోసం రాజీనామా చేశానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

ప్రధానికి ధన్యవాదాలు...

అడిగిన వెంటనే సమయం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరపున ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. మోదీతో దాదాపు 20 నిమిషాల పాటు చర్చించినట్లు చెప్పారు. మూసి ప్రాజెక్ట్ డ్రింకింగ్ కొరకు నిర్మాణం చేపట్టారని అన్నారు. మూసినది ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. గతంలో గుజరాత్‌లో సబర్మతి నది కూడా మూసిలాగే ఉండేదన్నారు. హైద్రారాబాద్ -విజయవాడ జాతీయ రహదారి 6 లైన్స్ చేయాలని కోరినట్లు చెప్పారు. జీఎంఆర్ సంస్థ 6 లైన్స్ నిర్మాణం ఆలస్యం చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రధానికి వివరించానన్నారు. ‘‘తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్‌లో ఉందా అని ప్రధాని అడిగారు.... అన్ని పరిస్థితులు మాకన్నా మీకే తెలుసు’’ అని చెప్పానని ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2022-12-16T14:20:59+05:30 IST