Rishabh Pant: పంత్ నుదుటికి ప్లాస్టిక్ సర్జరీ

ABN , First Publish Date - 2022-12-31T16:50:12+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా

Rishabh Pant: పంత్ నుదుటికి ప్లాస్టిక్ సర్జరీ
Rishabh Pant

డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్ (Rishabh Pant) నుదుటికి వైద్యులు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం తప్పిందని డీడీసీఏ( Delhi & District Cricket Association) డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. శుక్రవారం ఉదయం పంత్ తన బెంజ్‌కారులో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ (Dehradun) వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్‌ను ఢీకొన్ని కారు ఆ వెంటనే మంటలకు ఆహుతైంది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఓ బస్సు డ్రైవర్ క్షణాల్లో స్పందించి పంత్‌ను కారు నుంచి బయటకు లాగి ప్రాణాలు రక్షించాడు. పంత్ నుదుటికి గాయాలు కాగా, కుడి మోకాలు స్నాయువు (Ligament Tear) స్థానభ్రంశం చెందింది.

పంత్ నుదుటిపై వైద్యులు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేశారని, అతడు చికిత్స పొందుతున్న డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులతో బీసీసీఐ (BCCI) సంప్రదింపులు జరుపుతోందని శ్యామ్ శర్మ తెలిపారు. పంత్‌ను వైద్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారని, బీసీసీఐ అతడి ఆరోగ్యంపై ఎప్పటికిప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటోందని అన్నారు.

Updated Date - 2022-12-31T16:50:14+05:30 IST