Viral Video: కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తుండగా.. వద్దు వద్దు.. అంటూ మధ్యలో ఏ చేసిందంటే..

ABN , First Publish Date - 2022-12-03T18:47:39+05:30 IST

పెంపుడు జంతువులను సొంత పిల్లల్లా చూసుకుంటుంటారు కొందరు. స్నానం చేయించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఇందులో ఎలాంటి విశేషం లేకపోవచ్చు. కానీ..

Viral Video: కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తుండగా.. వద్దు వద్దు.. అంటూ మధ్యలో ఏ చేసిందంటే..

పెంపుడు జంతువులను సొంత పిల్లల్లా చూసుకుంటుంటారు కొందరు. స్నానం చేయించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఇందులో ఎలాంటి విశేషం లేకపోవచ్చు. కానీ ఇంకొందరు ఒకడుగు ముందుకేసి.. పులులు, సింహాలను కూడా పెంపుడు జంతువుల్లా చూసుకుంటుంటారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి ఇంకా వెరైటీ. ఏకంగా కింగ్ కోబ్రానే పెంచుకుంటున్నాడు. అంతే కాదు.. దానికి స్నానం కూడా చేయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బలవంతంగా స్నానం చేయిస్తుంటే.. మధ్యలో ఆ పాము ఏం చేసిందంటే..

Viral Video: ఇదేం పైత్యం.. వేదికపై హుక్కా తాగిన వధువు.. వరుడికి ఎలా ముద్దు పెట్టిందో చూడండి..

snake.jpg

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో కింగ్ కోబ్రాను (King Cobra) పెంచుకుంటున్నాడు. దానికి దగ్గరుండి మరీ స్నానం చేయించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పాము బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానానికి రెడీ చేస్తాడు. అయితే మొదటి నుంచీ ఆ పాము.. స్నానం చేసేందుకు ఇష్టపడదు. అయినా ఆ వ్యక్తి బలవంతంగా స్నానం చేయిస్తాడు. నాకు స్నానం వద్దు.. అన్నట్లుగా పడగ విప్పి మరీ హెచ్చరిస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం పాము తల మీద చెయ్యి పెట్టి, కిందకు వంచి మరీ మీద నీళ్లు పోస్తాడు. దీంతో పాముకు కోపం కట్టలు తెంచుకుంటుంది. వద్దు వద్దు అంటుంటే స్నానం చేయిస్తావ్.. అన్నట్లుగా కోపంతో చేతిలోని మగ్గును నోటితో గట్టిగా పట్టుకుంటుంది. అయినా ఆ వ్యక్తి మాత్రం స్నానం చేయించడం మాత్రం మానడు. ఇంత చేస్తున్నా.. అతడిపై పాము దాడి చేయకపోవడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై పలువురు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

లిఫ్ట్ అడిగి మరీ మహిళా ప్రొఫెసర్‌ కారులో ఎక్కాడు.. ‘‘మేడం నా ఫోకస్ అంతా మీ పైనే’’ అంటూ నవ్వుతూనే..

Updated Date - 2022-12-03T18:53:14+05:30 IST