Viral Video: అంత పెద్ద వాహనాన్ని.. సీటుపై కూర్చోకుండా.. ఒంటి చేత్తో ఎలా పార్క్ చేశాడో చూస్తే..

ABN , First Publish Date - 2022-11-27T19:44:09+05:30 IST

కొందరు తాము రోజు వారీ చేసే పనుల్లోనే ప్రత్యేకతను కనబరుస్తుంటారు. అందరిలా కాకుండా ఏదో ఒక కొత్తదనం చూపించి.. అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొందరు చేసే విన్యాసాలు చూస్తే...

Viral Video: అంత పెద్ద వాహనాన్ని.. సీటుపై కూర్చోకుండా.. ఒంటి చేత్తో ఎలా పార్క్ చేశాడో చూస్తే..

కొందరు తాము రోజు వారీ చేసే పనుల్లోనే ప్రత్యేకతను కనబరుస్తుంటారు. అందరిలా కాకుండా ఏదో ఒక కొత్తదనం చూపించి.. అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం ఓ లారీ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సీటుపై కూర్చోకుండా ఓ పెద్ద ట్రక్కును పార్కు చేసిన డ్రైవర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పెళ్లిలో డీజే పాటలకు అంతా డాన్సులు వేస్తుంటే.. ఫుల్‌గా మందు తాగిన యువకులు.. అర్ధరాత్రి చేసిన పనికి అంతా షాక్..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ పొడవైన ట్రక్కును పార్కు చేసేందుకు డ్రైవర్ (Truck driver) ప్రయత్నిస్తాడు. అందిరిలా పార్క చేసి ఉంటే విశేషం ఏమీ లేదు.. కానీ ఇతడు పార్కు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ట్రక్కును స్టార్ట్ చేసి, సీటుపై కూర్చోకుండా కింద నిలబడి ఉంటాడు. ట్రక్కు మెల్లగా వెనక్కు వెళ్తూ ఉంటుంది. ఆ వ్యక్తి దాని వెంటే నడుస్తూ కేవలం ఒక చేత్తో స్టీరింగ్‌ను పట్టుకుని హ్యాండిల్ చేస్తాడు. కొద్ది దూరం అలాగే వెళ్తూ.. మధ్య మధ్యలో స్టీరింగ్‌ను వదిలిపెట్టి, స్టైల్‌గా నడుస్తూ కెమెరాలకు ఫోజులిస్తాడు. కాసేపటికి సరిగ్గా పార్కింగ్ స్థలంలో (Parking space) ట్రక్కును పార్క్ చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదేమీ పెద్ద కష్టం ఏమీ కాదు అని.. కొందరు అంటుంటే.. ఇలా చేయడం ప్రమాదకరం.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి విషయం మాట్లాడాలంటూ కొడుకు ప్రియురాలిని పిలిచిన తండ్రి.. నేనున్నా అని హామీ ఇచ్చి.. ఊహించని విధంగా..

Updated Date - 2022-11-27T19:46:43+05:30 IST