Viral Video: ఏంట్రా.. అవేమన్నా కూరగాయలు అనుకున్నారా.. అంతా చూస్తుండగానే ఐపోన్లను ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..

ABN , First Publish Date - 2022-12-06T20:10:41+05:30 IST

గుట్టుచప్పుడు కాకుండా చోరీలు చేసేవారు కొందరుంటే.. మరికొందరు దౌర్జన్యంగా బెదిరించి మరీ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రాణభయంతో చాలా మంది మిన్నకుండిపోతుంటారు. కానీ..

Viral Video: ఏంట్రా.. అవేమన్నా కూరగాయలు అనుకున్నారా.. అంతా చూస్తుండగానే ఐపోన్లను ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..

గుట్టుచప్పుడు కాకుండా చోరీలు చేసేవారు కొందరుంటే.. మరికొందరు దౌర్జన్యంగా బెదిరించి మరీ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రాణభయంతో చాలా మంది మిన్నకుండిపోతుంటారు. కానీ కొన్ని చోరీలు చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. అలాంటి ఆశ్చర్యకర చోరీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా చూస్తుండగా.. కొందరు దుండగులు ఐఫోన్లను (iPhones) కూరగాయల తరహాలో బ్యాగుల్లో వేసుకుని వెళ్లిపోయారు. కత్తులు, తుపాకులు.. ఇలాంటివేవీ చూపించకున్నా.. అక్కడున్న వారు కిక్కురుమనలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో! ఈ ఆటోకేమైనా దయ్యం పట్టిందా.. డ్రైవర్ లేకుండానే ఇలా తిరుగుతుందేంటీ..

కాలిఫోర్నియాలోని (California) ఓ యాపిల్ స్టోర్‌లో (Apple Store) ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ల ఇతర ఎలక్ట్రానిక్ పరికాలను ప్రదర్శనగా ఉంచిన స్టోర్‌లో జనం ఎవరికి కావాల్సినవి వారు కొంటూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి ఇద్దరు యువకులు వచ్చారు. కత్తులు, తుపాకులు.. ఇలాంటివేవీ చూపించకుండానే.. జనాన్ని భయాందోళనకు గురి చేశారు. అంతా చూస్తుండగా.. ధైర్యంగా తమకు కావాల్సిన ఫోన్లను బ్యాగుల్లో (theft) వేసుకున్నారు. అంతమంది జనం ఉన్నా... ఎవరూ వారిని ఆపే ప్రయత్నం చేయరు. అయితే వారిలో కొందరు వారిని ఆపండి అనగా.. మరికొందరు వద్దు వాళ్లను వెళ్లనివ్వండి అంటారు. డజన్ల కొద్దీ ఫోన్లను ఎత్తుకెళ్లడం చూసి అక్కడున్న వారంతా షాక్ అవుతారు. మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ మిన్నకుండిపోతారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది పబ్లిసిటీ కోసం కావాలనే ఇలా చేశారు అని కొందరు అంటుండగా, ఆ సమయంలోనూ ఉద్యోగులు కస్టమర్లను రక్షించడం అభినందనీయం.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారా, లేదా అనే విషయం తెలియరాలేదు.

Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..

Updated Date - 2022-12-06T20:10:46+05:30 IST