ఇలాంటి పని చేయడానికి ఎలా మనసొచ్చిందమ్మా.. 10 రోజుల క్రితమే పుట్టిన పాపను ఎముకలు కొరికే చలిలో..

ABN , First Publish Date - 2022-12-15T20:47:39+05:30 IST

ఆడపిల్ల పుట్టిందంటేనే చాలు.. తల్లిదండ్రులతో పాటూ కుటుంబ సభ్యులు మొత్తం అసహ్యించుకుంటుంటారు. కొందరు తల్లులు కూడా ఆడపిల్లల పట్ల చిన్నచూపు చూడడం విచారకరం. కొందరు..

ఇలాంటి పని చేయడానికి ఎలా మనసొచ్చిందమ్మా.. 10 రోజుల క్రితమే పుట్టిన పాపను ఎముకలు కొరికే చలిలో..

ఆడపిల్ల పుట్టిందంటేనే చాలు.. తల్లిదండ్రులతో పాటూ కుటుంబ సభ్యులు మొత్తం అసహ్యించుకుంటుంటారు. కొందరు తల్లులు కూడా ఆడపిల్లల పట్ల చిన్నచూపు చూడడం విచారకరం. కొందరు బతికుండగా చిత్రహింసలకు గురిచేస్తే.. మరికొందరు కడుపులో ఉండగానే కనికరం లేకుండా చంపేస్తుంటారు. ఇంకొందరు అప్పుడే పుట్టిన ఆడ పిల్లలను అనాథల్లా రోడ్లు, చెత్తకుప్పల్లో పడేస్తుంటారు. హర్యానాలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. 10రోజుల క్రితం పుట్టిన పసిపాపను ఎముకలు కొరికే చలిలో వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు.. ఇలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందమ్మా.. అంటూ తిట్టిపోస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరాడో దొంగ.. అలికిడికి నిద్రలేచిన మహిళ.. చివరకు ఊహించని సీన్..!

హర్యానా (Haryana) పానిపట్ పరిధి మోడల్ టౌన్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రవీంద్ర హాస్పటిల్ సమీపంలోని జుగాద్ రెహదీ అనే ప్రాంతంలో రాత్రి 9గంటల సమయంలో పసికందు (baby) ఏడుస్తూ ఉంది. అదే సమయంలో కల్టా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మందులు తీసుకోవడానికి ఆస్పత్రి వద్దకు వచ్చాడు. కారు దిగగానే శిశువు ఏడుపు విని అక్కడికి వెళ్లాడు. ఎముకలు కొరికే చలిలో.. దుప్పట్లో చుట్టి ఉన్న చిన్నారిని చూసి చలించిపోయాడు. స్థానిక మహిళ సాయం తీసుకుని శిశువును సంరక్షించాడు.

ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా..? 70 ఏళ్ల వృద్ధురాలిపై 55 ఏళ్ల వ్యక్తి దారుణమిదీ..!

బాలిక పక్కనే పాల సీసా ఉండడంతో.. మహిళలు వెంటనే పాలు పట్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. చుట్టు పక్కల ప్రాంతాల వారితో మాట్లాడగా.. సాయంత్రం 6గంటల సమయంలో ఇద్దరు యువకులు దుప్పటి పట్టుకుని చాలా సేపు తిరిగినట్లు చెప్పారు. శిశువుకు సుమారు 10 రోజుల వయసు ఉంటుందని తెలిసింది. దీంతో చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బావిలో పడిందేమోనని రెస్క్యూ ఆపరేషన్.. ఇంట్లో హాయిగా నిద్రపోయిన పదేళ్ల బాలిక..!

Updated Date - 2022-12-15T20:48:00+05:30 IST