అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరాడో దొంగ.. అలికిడికి నిద్రలేచిన మహిళ.. చివరకు ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2022-12-15T19:08:57+05:30 IST

జల్సాలకు అలవాటు పడిన యువకులు చివరకు ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. మరికొందరు యువకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో..

అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరాడో దొంగ.. అలికిడికి నిద్రలేచిన మహిళ.. చివరకు ఊహించని సీన్..!
ప్రతీకాత్మక చిత్రం

జల్సాలకు అలవాటు పడిన యువకులు చివరకు ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. మరికొందరు యువకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు ఇలాగే దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఒక్కసారిగా అలికిడి వచ్చిన మహిళ నిద్రలేచింది. మంచం పక్కనే దొంగను చూసి భయంతో కేకలు వేసింది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..

man-theft.jpg

ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా..? 70 ఏళ్ల వృద్ధురాలిపై 55 ఏళ్ల వ్యక్తి దారుణమిదీ..!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి ఖజ్రానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కంచన్ అనే మహిళ.. సోదరుడు దీపక్, కొడుకుతో కలిసి ఉంటోంది. ఇదిలావుండగా, బుధవారం రాత్రి 2గంటల సమయంలో స్థానిక ప్రాంతానికి చెందిన వినోద్ యువకుడు దొంగతనం (theft) చేయాలనే ఉద్దేశంతో ఖజ్రానా ప్రాంతానికి వచ్చాడు. కంచన్ ఇంటిని టార్గెట్ చేసి, లోపలికి ప్రవేశించాడు. అయితే ఈ క్రమంలో శబ్ధం రావడంతో కంచన్‌కు మెలకువ వచ్చింది. లేచి చూడగా.. మంచం పక్కనే దొంగ నిలబడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై.. గట్టిగా కేకలు పెట్టింది. ఆమె సోదరుడు, కొడుకు నిద్ర లేచి అక్కడికి వచ్చారు.

బావిలో పడిందేమోనని రెస్క్యూ ఆపరేషన్.. ఇంట్లో హాయిగా నిద్రపోయిన పదేళ్ల బాలిక..!

వారు రావడం చూసి దొంగ పరారయ్యాడు. అయితే ఈ క్రమంలో కాలుకు రాయి తగిలి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అతన్ని అదుపులోకి తీసుకున్న కంచన్ కుటుంబ సభ్యులు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు (police) అక్కడికి చేరుకుని విచారించారు. నిందితుడు 15ఏళ్లుగా స్థానిక ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండో పెళ్లి కావడం లేదని దిగులు.. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో..

Updated Date - 2022-12-15T19:09:02+05:30 IST