అనుకోకుండా ఇంటికొచ్చిన మొదటి భార్య.. అర్ధరాత్రి రెండో భార్య గదిలోకి పామును వదిలిన భర్త.. ఉదయం చూస్తే..

ABN , First Publish Date - 2022-12-15T21:24:06+05:30 IST

అతడికి అప్పటికే వివాహమైంది. అయితే మొదటి భార్య వదలి వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల అనుకోకుండా..

అనుకోకుండా ఇంటికొచ్చిన మొదటి భార్య.. అర్ధరాత్రి రెండో భార్య గదిలోకి పామును వదిలిన భర్త.. ఉదయం చూస్తే..

అతడికి అప్పటికే వివాహమైంది. అయితే మొదటి భార్య వదలి వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల అనుకోకుండా మొదటి భార్య ఇంటికి వచ్చింది. చివరకు ఇద్దరూ కలిసి రెండో భార్యను చంపేందుకు కుట్రపన్నారు. అర్ధరాత్రి ఆమె గదిలోకి విషపూరితమైన పామును వదిలారు. ఉదయం వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఇలాంటి పని చేయడానికి ఎలా మనసొచ్చిందమ్మా.. 10 రోజుల క్రితమే పుట్టిన పాపను ఎముకలు కొరికే చలిలో..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మందసౌర్‌ పరిధి మాల్యఖేడి గ్రామానికి చెందిన అజ్మీరీ కొన్నేళ్ల క్రితం హలీమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ప్రస్తుతం ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అజ్మీరీకి అప్పటికే షా అనే మహిళతో వివాహమైంది. కాగా, సుమారు ఏడేళ్ల క్రితం అతడు ఓ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో మొదటి భార్య (First wife) అజ్మీరిని విడిచి వెళ్లిపోయింది. ఇలావుండగా కొన్ని నెలల క్రితం మొదటి భార్య మళ్లీ భర్త వద్దకు వచ్చింది. రెండో వివాహం చేసుకోవడంపై భర్తతో వాగ్వాదానికి దిగింది. ఎలాగైనా తనను పంపించేయాలని కండీషన్ పెట్టింది. దీంతో చివరకు ఇద్దరూ కలిసి కుట్ర (Conspiracy) పన్నారు. 2022మేలో తనకు తెలిసిన స్నేక్ క్యాచర్‌తో మాట్లాడి విషపూరితమైన పామును తెప్పించాడు.

అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరాడో దొంగ.. అలికిడికి నిద్రలేచిన మహిళ.. చివరకు ఊహించని సీన్..!

రాత్రి పడుకుని ఉన్న రెండో భార్య మీద పామును వదిలి తలుపు వేశాడు. అయితే ఆశ్చర్యకరంగా పాము (snake) రెండుసార్లు కాటు వేసినా ఆమె బతికే ఉంది. దీంతో మళ్లీ ఆమెకు విషపూరితమైన ఇంజెక్షన్ (Poisonous injection) కూడా ఇచ్చారు. అయినా ఆమెకు ఏమీ కాలేదు. చివరకు స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పాములు కొన్నిసార్లు ఎన్నిసార్లు కాటు వేసినా విషం బయటికి రాకపోవచ్చని, ఈ కేసులో అలాగే జరిగి ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లోనే అజ్మీర్‌ను, అతడి మొదటి భార్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే పామును తీసుకొచ్చిన మధ్యవర్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

బావిలో పడిందేమోనని రెస్క్యూ ఆపరేషన్.. ఇంట్లో హాయిగా నిద్రపోయిన పదేళ్ల బాలిక..!

Updated Date - 2022-12-15T21:24:14+05:30 IST