Viral Video: మంచును చూడగానే మైమరచిపోయిన ఒంటె.. ఏం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..

ABN , First Publish Date - 2022-12-16T20:45:56+05:30 IST

అందమైన ప్రకృతిని చూస్తే.. ఎలాంటి వారికైనా మనసు పులకరిస్తుంది. అలాంటి సమయాల్లో మనసులోని బాధలన్నీ తొలగిపోయి మనసు తేలికపడుతుంది. అలాంటి ప్రదేశాల్లో..

Viral Video: మంచును చూడగానే మైమరచిపోయిన ఒంటె.. ఏం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..

అందమైన ప్రకృతిని చూస్తే.. ఎలాంటి వారికైనా మనసు పులకరిస్తుంది. అలాంటి సమయాల్లో మనసులోని బాధలన్నీ తొలగిపోయి మనసు తేలికపడుతుంది. అలాంటి ప్రదేశాల్లో నిత్యం ఉండిపోవాలని అనుకుంటారు. ఇలాంటి అనుభూతే జంతువులకు కూడా కలుగుతుంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. ఈ ఒంటెను చూస్తే నిజం అని మీరే ఒప్పుకొంటారు. మంచును చూడగానే ఒక్కసారిగా మైమరచిపోయింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

అనుకోకుండా ఇంటికొచ్చిన మొదటి భార్య.. అర్ధరాత్రి రెండో భార్య గదిలోకి పామును వదిలిన భర్త.. ఉదయం చూస్తే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Social media viral videos) అవుతోంది. ఓ ఒంటె ముందు నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక మేకల (goats) మంద అనుసరిస్తూ ఉంటుంది. అయితే మంచు ప్రాంతంలోకి వెళ్లగానే ఒక్కసారిగా ఒంటె (camel) తెగ ఆనందపడిపోతుంది. వావ్! ఈ మంచు ఎంత బాగుంది.. అన్నట్లుగా ఒక్కసారిగా ఎగిరి గంతులేస్తుంది. చిన్న పిల్లలు మంచులో ఆడుకుంటే ఎలా ఉంటుందో.. అచ్చం అలాగే ప్రవర్తించింది. తర్వాత తన ఆనందాన్ని మేకల మందతో పంచుకున్నట్లుగా ముందు ఉత్సాహంగా నడుస్తూ వెళ్తుంది. తన యజమాని మేత పెడుతున్నా.. తనకు ఆ మంచు ప్రాంతమే ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఒంటె ఆనందం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది.. అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

దృశ్యం2 సినిమాను రెండు సార్లు చూసి.. ఇంటికొచ్చి య్యూటూబ్‌లో పరిశీలించి.. చివరకు ఈ వ్యక్తి చేసిన పని..

Updated Date - 2022-12-20T01:18:01+05:30 IST