Pawan Kalyan: ఆదర్శ మాతృమూర్తి హీరాబెన్ మోదీ

ABN , First Publish Date - 2022-12-30T11:25:38+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.

Pawan Kalyan: ఆదర్శ మాతృమూర్తి హీరాబెన్ మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి (Prime Minister Narendra Modi's mother Heeraben passed away)పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సంతాపం తెలిపారు. ఆదర్శ మాతృమూర్తి హీరా బెన్ మోదీ అని అన్నారు. నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ స్వర్గగతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడి ప్రార్ధిస్తున్నానన్నారు. నిండు నూరేళ్ళపాటు నిష్కామయోగంతో సంపూర్ణ జీవితం చవి చూసిన హీరాబెన్ గొప్ప పుణ్యవతి అని కొనియాడారు. విలక్షణమైన నాయకత్వపటిమ, నిండుగా మెండుగా దేశ భక్తి కలిగిన నరేంద్ర మోదీ వంటి కుమారునికి జన్మనిచ్చి... సచ్ఛీలతతో పెంచి పెద్దచేసి భారతమాత సేవకు కుమారుణ్ని అందించి ఆమె వీరమాతగా నిలిచిపోయారని అన్నారు. మోదీకి, కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2022-12-30T11:25:39+05:30 IST