Yanamala Brothers Disunity: ‘‘కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమలకు గట్టిగా చెప్పండి’’

ABN , First Publish Date - 2022-12-26T14:08:16+05:30 IST

తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు తలెత్తాయి.

Yanamala Brothers Disunity: ‘‘కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమలకు గట్టిగా చెప్పండి’’

కాకినాడ: తుని సీటు విషయంలో యనమల సోదరుల (Yanamala Brothers) మధ్య విభేదాలు తలెత్తాయి. తుని టీడీపీ సీటు కూతురుకి ఇస్తున్నారని సంకేతాలు ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి (TDP Senior Leader yanamala Ramakrishnudu)పై తమ్ముడు కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తుని టీడీపీ ఇన్చార్జ్ యనమల కృష్ణుడు (Tuni TDP in-charge Yanamala Krishnudu), తొండంగి టీడీపీ నేత మధ్య ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫోన్‌కాల్‌లో యనమల కృష్ణుడు ఏమన్నారంటే...

‘‘యాదవ సామాజికవర్గంలో 30 వేల ఓట్లు ఉన్నాయి, నేను లేకపోతే ఎవరు చూడరు. యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుంది. యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు.. నా కూతురికి ఇవ్వనని రామకృష్ణుడిని చెప్పమనండి. తునిలో వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా మళ్ళీ నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారు. నేను కష్టపడితే యనమల రామకృష్ణ కూతురుకు సీటు ఇస్తారా అని అడగండి. ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమల రామకృష్ణుడుకి గట్టిగా చెప్పండి’’ అంటూ యనమల కృష్ణుడు ఫోన్‌‌లో మాట్లాడిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2022-12-26T15:04:09+05:30 IST