TTD: టీటీడీ పాలకమండలి భేటీ.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చ
ABN , First Publish Date - 2022-11-30T17:31:24+05:30 IST
తిరుమల (Tirumala) టీటీడీ (TTD) పాలకమండలి సమావేశం ప్రారంభమైంది.

తిరుమల: తిరుమల (Tirumala) టీటీడీ (TTD) పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనుల తేదీని పాలకమండలి ఖరారు చేయనుంది. తాపడం పనులు జరుగుతున్నప్పటికీ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై పాలకమండలి భేటీలో చర్చించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 12 వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.
Read more