Share News

Viral Video: పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. ఉన్నట్టుండి..

ABN , Publish Date - Apr 20 , 2024 | 08:54 PM

వివాహ కార్యక్రమాల్లో వధూవరులతో పాటూ స్నేహితులు. బంధువులు ఒకరినొకరు వివిధ రకాలుగా ఆటపట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సరదా ఘటనలు కాస్తా.. సీరియస్‌గా మారుతుంటాయి. ఈ తరహా..

Viral Video: పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. ఉన్నట్టుండి..

వివాహ కార్యక్రమాల్లో వధూవరులతో పాటూ స్నేహితులు. బంధువులు ఒకరినొకరు వివిధ రకాలుగా ఆటపట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సరదా ఘటనలు కాస్తా.. సీరియస్‌గా మారుతుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వివాహ కార్యక్రమంలో పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. ఆకతాయిలు చేసిన పనికి చివరికి ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా.. ఎదురుగా పురోహితుడు వివాహ క్రతువును నిర్వహిస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఒక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కొందరు ఆకతాయిలు పురోహితుడిని టార్గెట్ చేస్తారు. మంత్రాలు చదువుతున్న పురోహితుడి (pandit) తలపై ఖాళీ సంచిని బోర్లిస్తారు. ఊహించని ఈ ఘటనతో పురోహితుడితో పాటూ అక్కడున్నవారంతా షాక్ అవుతారు. అయితే చుట్టూ ఉన్న వారు సర్దిచెప్పడంతో పురోహితుడు కూడా వేదికపై కూర్చుని కార్యక్రమం కొనసాగిస్తుంటాడు.

Viral Video: ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. గాల్లోకి ఎగరేస్తూ చిటికెలో ఆకుకూరల టీ ఎలా చేశాడో చూడండి..

అయితే అంతటితో ఆగని ఆకతాయిలు.. ఆయనపై రంగులు చల్లడంతో పాటూ దుప్పట్లు కూడా విసిరేస్తారు. దీంతో పురోహితుడికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ఈ పెళ్లి చేయను.. నేను వెళ్లిపోతున్నా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. పక్కన ఉన్న వారంతా పూజారిని బ్రతిమాలే ప్రయత్నం చేస్తారు. కానీ అతను మాత్రం వినిపించుకోకుండా వేదిక పైనుంచి దిగి దూరంగా వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం పద్ధతి కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలుగుబంటికి కోపం వస్తే పులి కూడా పిల్లే.. దాడి చేయాలని చూసిన పులిని..

Updated Date - Apr 20 , 2024 | 08:54 PM