Share News

Marriage Video: పెళ్లి వేదికపై వరుడి కక్కుర్తి.. వధువు పక్కనే కూర్చుని.. ఆమెకు తెలీకుండానే..

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:06 PM

వివాహాల్లో చోటు చేసుకునే ఏ చిన్న ఘటన అయినా ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతుంటుంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్ని వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. వధూవరుల మధ్య చోటు చేసుకునే కొన్ని ఘటనలు...

Marriage Video: పెళ్లి వేదికపై వరుడి కక్కుర్తి.. వధువు పక్కనే కూర్చుని.. ఆమెకు తెలీకుండానే..

వివాహాల్లో చోటు చేసుకునే ఏ చిన్న ఘటన అయినా ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతుంటుంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్ని వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. వధూవరుల మధ్య చోటు చేసుకునే కొన్ని ఘటనలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, వధూవరుల మధ్య చోటు చేసుకున్న తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి వేదికపై ఓ వరుడు కక్కుర్తితో చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. పెళ్లి వేదికపై వధూవరులు (bride and groom) సోఫాలో కూర్చుని ఉంటారు. బంధువులు, స్నేహితులంతా వారికి గిఫ్ట్‌లు ఇస్తుంటారు. వధూవరుల ఒడిలో ఓ టవల్ పరిచి, అందులో ఎవరితోచిన నగదును వారు వేసి వెళ్లిపోతుంటారు. ఇలా చివరకు ఇద్దరికీ ఒడిలో చాలా నగదు జమ అయింది. అయితే వరుడు కంటే వధువు ఒడిలోనే ఎక్కువ నగదు ఉంటుంది. దీంతో వరుడు ఆమె నగదుపై కన్నేస్తాడు.

Viral Video: గాడిదతో ఎగసెక్కాలు ఆడితే ఇలాగే ఉంటుంది.. ఇతడి పరిస్థితి ఏమైందో చూడండి..

వధువు తన స్నేహితులతో మాట్లాడుతుండగా.. ‘‘ఇదే సరైన సమయం’’.. అని అనుకుని ఆమె ఒడిలో ఉన్న కరెన్సీ నోట్లను తీసుకుని తన ఒడిలో వేసుకుంటాడు. స్నేహితులతో సరాదాగా మాట్లాడుతున్న వధువు.. వరుడు చోరీ చేయడాన్ని గమనించదు. అయితే అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు చాలా ఫన్నీగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఈ జంట చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో దూరిన పామును.. ఈమె ఎంత ఈజీగా పట్టేసిందో చూస్తే..

Updated Date - Apr 20 , 2024 | 04:07 PM