Share News

Viral Video: ఎలుగుబంటికి కోపం వస్తే పులి కూడా పిల్లే.. దాడి చేయాలని చూసిన పులిని..

ABN , Publish Date - Apr 20 , 2024 | 08:14 PM

అడవిలో పులులు, సింహాలకు దాదాపు అన్ని జంతువులూ భయంతో వణికిపోతుంటాయి. అయితే కొన్ని జంతువుల విషయంలో పులులు కూడా పిల్లుల మాదిరి మారుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: ఎలుగుబంటికి కోపం వస్తే పులి కూడా పిల్లే.. దాడి చేయాలని చూసిన పులిని..

అడవిలో పులులు, సింహాలకు దాదాపు అన్ని జంతువులూ భయంతో వణికిపోతుంటాయి. అయితే కొన్ని జంతువుల విషయంలో పులులు కూడా పిల్లుల మాదిరి మారుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా పులి, ఎలుగుబంటికి సంబంధించిన వీడయో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎలుగుబంటి మీద దాడి చేయడానికి వెళ్లిన పులి పరిస్థితి చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ జిల్లాలోని తడోబా టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవిలోని రోడ్డు పక్కన కల్వర్టు కింద ఓ ఎలుగుబంటి (bear) విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఓ పులి అక్కడికి వెళ్తుంది. ఎలుగుబంటిపై దాడి చేసి చంపేయాలని చూస్తుంది. దగ్గరికి వెళ్లగానే ఎలుగుబంటి గమనిస్తుంది. పులి (tiger) తనపైకి రావడం చూసి దానికి కోపం కట్టలు తెంచుకుంటుంది.

Viral Video: ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. గాల్లోకి ఎగరేస్తూ చిటికెలో ఆకుకూరల టీ ఎలా చేశాడో చూడండి..

పులికి ఎదురుగా వెళ్లిన ఎలుగుబంటి.. రెండు కాళ్లపై నిలబడి వింతగా ప్రవర్తిస్తూ పులిని భయపెడుతుంది. ఎలుగును చూసి భయపడిపోయిన పులి.. ‘‘వామ్మో..! దీంతో పెట్టుకుంటే మన పని అయిపోయేలా ఉందే’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి ఉడాయిస్తుంది. పులి పారిపోవడం చూసి ఎలుగుబంటి దాని వెనుకే వెళ్లి మరింత వేగంగా పరుగెత్తిస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎలుగుబంటి పవర్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తోక ముడిచిన పులి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మందు గానీ కొట్టిందా ఏంటీ..! గ్లాస్ డోరు వద్ద ఈమె చేస్తున్న పని చూస్తే.. మీకూ ఇదే డౌట్ రావొచ్చు..

Updated Date - Apr 20 , 2024 | 08:14 PM