Share News

Viral Video: మందు గానీ కొట్టిందా ఏంటీ..! గ్లాస్ డోరు వద్ద ఈమె చేస్తున్న పని చూస్తే.. మీకూ ఇదే డౌట్ రావొచ్చు..

ABN , Publish Date - Apr 20 , 2024 | 06:23 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్ కోసం కొందరు యువతులు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తూ ఉన్నాం. కొందరు బహిరంగ ప్రదేశాల్లో డాన్సులు వేయడం, అర్ధ నగ్న ప్రదర్శన చేయడం వంటి పనులు చేయడం చూశాం. ఇలాంటి...

Viral Video: మందు గానీ కొట్టిందా ఏంటీ..! గ్లాస్ డోరు వద్ద ఈమె చేస్తున్న పని చూస్తే.. మీకూ ఇదే డౌట్ రావొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్ కోసం కొందరు యువతులు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తూ ఉన్నాం. కొందరు బహిరంగ ప్రదేశాల్లో డాన్సులు వేయడం, అర్ధ నగ్న ప్రదర్శన చేయడం వంటి పనులు చేయడం చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అద్దాల డోరు వద్ద యువతి నిర్వాకం చూసిన నెటిజన్లు.. ‘‘ఈమె.. మందు గానీ కొట్టిందా ఏంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ స్టేడియం లోపల చుట్టూ గాజు అద్దాలను ఏర్పాటు చేశారు. లోపల చాలా మంది వివిధ ఆటలు ఆడుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఓ యువతి (young woman) లోపలికి వస్తుంది. వెళ్లే క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గాజు అద్దాలు (Glass mirrors) ఏర్పాటు చేయడంతో తలుపు ఎక్కడ ఉందనే విషయం తీక్షణంగా చూస్తే అర్థమవుతుంది. అయితే ఓ యువతి ఏమాత్రం గమనించకుండా నేరుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ధబేల్‌మని అద్దాలకు తగులుకుంటుంది.

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో దూరిన పామును.. ఈమె ఎంత ఈజీగా పట్టేసిందో చూస్తే..

అద్దాలు తగులుకొని నొప్పి పుట్టడంతో మూతిపై చేయి పెట్టుకుని అటు పక్క నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. అప్పటికైనా తలుపు ఎక్కడ ఉందనే విషయం చూసుకోకుండా మళ్లీ మూర్ఖంగా ప్రయత్నిస్తుంది. దీంతో మూడో సారి కూడా ఆమె తల అద్దాలకు తగులుకొని నొప్పి పుడుతంది. నాలుగో సారి ఆమె ఎలాగోలా తలుపు కనుక్కుని ఎట్టకేలకు లోపలికి వెళ్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె మందు గానీ కొట్టలేదు కదా’’.. అంటూ కొందరు, ‘‘ఈమె వ్యూస్ కోసమే ఇలా చేసినట్లు ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Marriage Video: పెళ్లి వేదికపై వరుడి కక్కుర్తి.. వధువు పక్కనే కూర్చుని.. ఆమెకు తెలీకుండానే..

Updated Date - Apr 20 , 2024 | 06:23 PM