Share News

Viral video: పక్కనే ఉండి షాక్ ఇచ్చిన వధువు.. మొఖం చూడాలని వరుడు ముసుగు తీయడంతో.. చివరకు..

ABN , Publish Date - May 04 , 2024 | 04:04 PM

వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు, ఇంకొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు వధువును వరుడు ఆటపట్టిస్తే.. మరికొన్నిసార్లు ...

Viral video: పక్కనే ఉండి షాక్ ఇచ్చిన వధువు.. మొఖం చూడాలని వరుడు ముసుగు తీయడంతో.. చివరకు..

వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు, ఇంకొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు వధువును వరుడు ఆటపట్టిస్తే.. మరికొన్నిసార్లు వరుడిని వధువు, ఆమె స్నేహితులు కలిసి ఆట పట్టించడం చూస్తుంటాం. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వధువు పక్కనే ఉంటూ వరుడికి పెద్ద షాక్ ఇచ్చింది. మొఖం చూడానలి వరుడు ముసుగు తీయడంతో చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) ఇద్దరూ సోఫాలో కూర్చుని ఉంటారు. అయితే వధువు మాత్రం మొఖంపై ముసుగు ధరించి ఉంటుంది. కాసేపు సైలెంట్‌గా ఉన్న వరుడు.. తర్వాత వధువును చూడాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆమె మొఖంపై ఉన్న ముసుగును మెల్లగా పైకి తీస్తాడు. అయితే చివరకు లోపల వధువుకు బదులుగా ఓ యువకుడి మొఖం చూసి ఖంగుతింటాడు.

Viral video: యువతి డాన్స్ చూసి దిగాలుగా ఉన్న వధూవరులు.. అంతలో ఆమె తల్లి అక్కడికి రావడంతో..


చివరకు తాను ఫూల్ అయ్యానని తెలుసుకున్న వరుడు.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి పనులతో నన్ను ఫూల్ చేస్తారా’’.. అంటూ అతడిపై చేయి చేసుకుంటాడు. వరుడు ఫూల్ అవడం చూసి పక్కన ఉన్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. అదే కలర్ చీర కట్టుకున్న వధువు.. ఆ పక్కనే కూర్చుని ఉంటుంది. పక్కన ఉన్న వారితో పాటూ ఆమె కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కామెడీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లికొడుకును భలే ఫూల్ చేశారే’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.7 లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లికొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి..

Updated Date - May 04 , 2024 | 04:04 PM