Share News

Viral Video: మాంసం ముక్కలను కట్ చేస్తుండగా.. దిమ్మతిరిగే సీన్.. ఒక్కసారిగా వాటిలో ఒకటి..

ABN , Publish Date - May 03 , 2024 | 03:34 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. అందులోనూ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం చాలా కష్టం. అయితే ...

Viral Video: మాంసం ముక్కలను కట్ చేస్తుండగా.. దిమ్మతిరిగే సీన్.. ఒక్కసారిగా వాటిలో ఒకటి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. అందులోనూ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం చాలా కష్టం. అయితే కొన్నిసార్లు ఎలాంటి గ్రాఫిక్స్ చేయకున్నా.. కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మాంసం ముక్కలు కట్ చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్ల చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఐదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మాంసం ముక్కలను (meat Pieces) ప్లేటులోకి తీసుకుని వంట చేయడానికి సిద్ధమయ్యాడు. మాంసం ముక్కలను ఓ ప్లేటులో పక్కన పెట్టి, వంటకు అవసరమయ్యే మిగతా ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్లేటలో ఉన్న మాంసం ముక్కల్లో ఓ పెద్ద ముక్కలో ఒక్కసారిగా చలనం వచ్చింది. నూనెలో వేయిస్తున్నారని గుర్తించి.. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయినట్లుగా... ప్లేటు నుంచి ఒక్కసారిగా పక్కకు జంప్ చేస్తుంది. అటు నుంచి అటే టేబుల్ కిందకు దూకేస్తుంది.

Viral Video: ఈ తల్లి గొరిల్లా యాక్టింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పిల్ల గొరిల్లా పదే పదే పిలుస్తున్నా..


మాంసం ముక్క కదలడాన్ని చూసిన సదరు వ్యక్తి షాక్ అవుతాడు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే చాలా మంది ఇది నిజమా, లేక గ్రాఫిక్సా.. అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. జీవి చనిపోయినా కండరాల్లోని నాడీ కణాలు చాలా సేపు పని చేస్తుంటాయని చెప్పారు. చుట్టూ తగినంత శక్తి ఉన్నంత వరకూ న్యూరాన్లు పని చేస్తాయని తెలిపారు. కండరాల వ్యాకోచం, సంకోచం వల్లే ఇలా మాంసం ముక్క అలా కదిలిందని తేల్చారు. మొత్తానికి ఆ ముక్క కప్పది అయి ఉంటుందని చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మాంసం ముక్క భలే ఎస్కేప్ అయిందే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి దృశ్యాలను ఎక్కడైనా చూశారా.. వీరి తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - May 03 , 2024 | 03:34 PM