Share News

Lok Sabha Elections 2024: అమేథి నుంచి నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:15 PM

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Lok Sabha Elections 2024: అమేథి నుంచి నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ

అమేథీ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ (Amethi) లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉందని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేశారు.


''అమేథీ నియోజకవర్గానికి సేవలందించేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. అమేథీలో గత ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 1,14,000 గృహాలు నిర్మించాం. 1.5 లక్షల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. 4 లక్షలకు పైగా రైతులు పీఎం కిసాన్ నిధిని అందుకున్నారు. ప్రజలు బీజేపీని, ప్రధానమంత్రి మోదీని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను'' అని నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్మృతి ఇరానీ చెప్పారు.

Lok Sabha Polls: ప్రియాంక అరంగేట్రం కోసం 'స్పెషల్ 24' టీమ్‌


రోడ్‌షో...

స్మృతి ఇరానీ నామినేషన్ వేయడానికి ముందు తన ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్‌షో నిర్వహిస్తూ నామినేషన్‌కు తరలి వెళ్లారు. అమెథీ రోడ్లపై రోడ్‌షా సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు గులాబీ రేకులు చల్లుతూ ఆమెకు స్వాగతం పలికారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న అమేథీలో పోలింగ్ జరుగనుంది.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 06:15 PM