Home » Priyanka Gandhi
వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్‌థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం పట్ల బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాలవియా మండిపడ్డారు.
మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్‌కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.
వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కలపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయం వెలుపల ఉన్నారు. దీంతో ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న సమయంలో ఆఫీసర్ గదికి వెలుపల ఖర్గే వేచి ఉన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది.
ప్రియాంక గాంధీ ఉన్న ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ స్థానిక నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలపై ప్రియాంకగాంధీ సంతకాలు చేశారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక.. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ ప్రజలు తన కుటుంబ..
తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం
నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా..
ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.