Share News

AP Elections 2024: చిత్తూరులో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

ABN , Publish Date - Apr 29 , 2024 | 07:19 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.

AP Elections 2024: చిత్తూరులో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

చిత్తూరు: ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. సదుం మండలం ఎర్రతివారిపల్లెలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రామచంద్ర యాదవ్‌, ఆ పార్టీ శ్రేణులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!

సదుం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రచార వాహనాన్ని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లోపల రామచంద్ర యాదవ్‌ ఉన్నారు. ఈ ఘటనలో సుమారు 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రామచంద్ర యాదవ్‌కు భద్రత కల్పించిన వై ప్లస్ కేటగిరి సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాలను సైతం వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. సదుం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత నెలకొంది.


ఇవి కూడా చదవండి

AP Elections 2024: మా ప్రచారంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆరణి శ్రీనివాసులు

AP Elections 2024: ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు.. ట్విస్ట్ ఏమిటంటే..?

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 08:06 PM