Home » Peddi Reddi Ramachandra Reddy
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆదివారం హై టెన్షన్ నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వస్తున్నారని సమాచారం రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వారంతా రెవెన్యూ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు.. అప్పట్లో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. తాము ప్రభుత్వాధికారులమనే కనీస భయం లేకుండా చేయకూడని పనులు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాకా గానే కొనసాగుతోంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు...
తిరుపతి: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, ఆయన ద్వారా భూమి కోల్పోయిన బాధితులందరూ బయటకు వచ్చి.. పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయాలని పిలుపిచ్చారు.
Andhrapradesh: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుందా..? ఇప్పుడిదే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక..
Andhrapradesh: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డిని వీరప్పన్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.