Share News

Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:01 PM

Andhrapradesh: జగ్గంపేట నియోజకవర్గంలో సూరంపల్లి ఆదిత్య కాలేజ్‌లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?! జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యమన్నారు.

Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!
TDP Leader Nara lokesh

అమరావతి, ఏప్రిల్ 20: కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganamohan Reddy) బస్సు యాత్ర సందర్భంగా సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజ్‌‌కు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) స్పందించారు. ‘‘జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?! జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యమన్నారు. జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవమని తెలిపారు.

Viral: దుబాయ్‌లో జలప్రళయం రేంజ్ ఇదా? ఒళ్లుగగుర్పొడిచే 30 సెకెన్ల వీడియో..!


కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం లేదంటూ విద్యార్థులు నిరసన తెలపడమే నేరమైందని అన్నారు. వైసీపీ నేతలు కాలేజ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వాస్తవాన్ని బయట పెట్టిన విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం తగునా జగన్? అంటూ విరుచుకుపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించి, కాలేజీ యాజమాన్యాల వద్ద ఉండిపోయిన 8 లక్షల సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేయాలన్నారు. తక్షణమే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన

మరిన్ని ఏపీ వార్తల కోసం....

Updated Date - Apr 20 , 2024 | 03:09 PM