Share News

PM Modi: చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడంటూ మోదీ జన్మదిన శుభాకాంక్షలు..

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:53 PM

టీడీపీ అధినేత చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతుంటారని మోదీ కొనియాడారు.

PM Modi: చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడంటూ మోదీ జన్మదిన శుభాకాంక్షలు..

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతుంటారని మోదీ కొనియాడారు. ప్రజల సేవలో ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని మోదీ తెలిపారు.

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!


ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు మిన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. కొందరు సైకిల్ ర్యాలీ చేస్తుంటే మరికొందరు అన్నదానం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానులు ట్విటర్ వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో HBDBabu హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచన

AP Elections: జగన్ గాలి తీసేసిన యువత.. ఆ సీన్ చూసి వైసీపీ మైండ్ బ్లాంక్

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 01:53 PM