Share News

AP HighCourt: పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలి.. హైకోర్ట్ ఆదేశం

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:21 PM

Andhrapradesh: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థికి 1+1 భద్రత కేటాయించాలని న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీకి పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు (సోమవారం) టీడీపీ అభ్యర్థి పిటిషన్‌‌పై విచారణ జరిగింది.

AP HighCourt: పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలి.. హైకోర్ట్ ఆదేశం
Chandragiri TDP Candidate Pulivarthi Nani

అమరావతి, ఏప్రిల్ 29: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి (Chandragiri TDP Candidate Pulivarthi Nani) భద్రత (Security) కల్పించాలంటూ ఏపీ హైకోర్టు (AP HighCourt) ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థికి 1+1 భద్రత కేటాయించాలని న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీకి పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు (సోమవారం) టీడీపీ అభ్యర్థి పిటిషన్‌‌పై విచారణ జరిగింది.

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లు


నాని తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇచ్చి, తర్వాత తొలగించారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎస్పీకి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని ఉమేష్ చంద్ర చెప్పారు. పోటీ చేసిన అభ్యర్థికి సెక్యూరిటీ ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈరోజు నుంచి పులివర్తి నానికి, ఆయన కుటుంబ సభ్యులకు 1+1 భద్రత కల్పించాలంటూ హైకోర్టు ధర్మాసం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!

AP Elections: వైసీపీ ఆశలన్నీ వాళ్లపైనే.. తేడా వస్తే ఫ్యాన్ ఫ్యూజులౌట్..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:59 PM