Share News

Viral Video: వీడు కొడుకు కాదు.. ఆస్తి కోసం కన్న తండ్రిపై కిరాతక దాడి.. నరకయాతన అనుభవించిన తండ్రి మృతి..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:13 PM

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే పద్యం చిన్న వయసులో అందరు చదువుకునే ఉంటారు. వేమన చెప్పిన ఆ పద్యానికి సజీవ తార్కాణం లాంటి ఘటన తమిళనాడులోని పెరంబళూర్‌లో జరిగింది.

Viral Video: వీడు కొడుకు కాదు.. ఆస్తి కోసం కన్న తండ్రిపై కిరాతక దాడి.. నరకయాతన అనుభవించిన తండ్రి మృతి..!
Son assaulting his father

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే పద్యం చిన్న వయసులో అందరు చదువుకునే ఉంటారు. వేమన చెప్పిన ఆ పద్యానికి సజీవ తార్కాణం లాంటి ఘటన తమిళనాడులోని పెరంబళూర్‌లో జరిగింది. ఆస్తి కోసం కన్న తండ్రి (Father) మీద అత్యంత కిరాతకంగా దాడి చేసిన కొడుకు (Son) పశువులా ప్రవర్తించాడు. రెండు నెలలకు పైగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన తండ్రి తాజాగా కన్నుమూశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


తమిళనాడు (Tamilnadu)లోని పెరంబళూర్ (Perambalur) లో ఒక ప్రైవేటు కంపెనీ యజమాని అయిన 65 ఏళ్ల కులందైవేలుకు కొడుకు సంతోష్‌తో ఆస్తి విషయమై వివాదం చెలరేగింది. దీంతో తండ్రిపై సంతోషం తీవ్ర కోపం పెంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 16వ తేదీన కులందైవేలు తన ఇంట్లోని సోఫాలో కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోష్.. తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తండ్రి మొహంపై ఎడాపెడా పిడిగుద్దులు కురిపించాడు. కాలితో తన్నాడు. వేరే వ్యక్తి వచ్చి సంతోష్‌ను బయటకు తీసుకెళ్లాడు (Son attacks father).


ఆ దెబ్బలకు తాళలేక కులందైవేలు ఆ సోఫాలోనే కుప్పకూలిపోయాడు. చుట్టు పక్కల వారు వచ్చి అతడిని లేవదీశారు. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కొడుకు తనపై చేసిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన కులందైవేలు కొన్ని రోజుల్లోనే విత్ డ్రా చేసుకున్నాడు. చివరకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 18న మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన సంతోష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Shocking: మీ కళ్లను మీరే నమ్మలేరు.. చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు.. అసలు నిజమేంటంటే..


Viral Video: ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. లారీ టైర్లు జంటగా ఎలా వెళ్లిపోయాయో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2024 | 04:13 PM