Share News

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. నేటి నుంచి బంద్!!

ABN , Publish Date - May 04 , 2024 | 02:52 PM

Andhrapradesh: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులు షాక్ ఇచ్చాయి. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈనెల ఏడవ తేదీ నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులకు డిసెంబర్‌లో 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. నేటి నుంచి బంద్!!
Big Shock to AP Government Employees

తిరుపతి, మే 4: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees) ప్రైవేటు ఆస్పత్రులు (Private Hospitals) షాక్ ఇచ్చాయి. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈనెల ఏడవ తేదీ నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులకు డిసెంబర్‌లో 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. అయితే అప్పట్లో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని (Aarogysree) నిలిపివేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం కేవలం రూ.560 కోట్లు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని బకాయిపెట్టారు.

AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!


కాగా ఇటీవల ఆరోగ్య శ్రీ లిమిట్‌ను ఐదు లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నాలుగు నెలల్లో మొత్తం ప్రభుత్వ బకాయిలు1600 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ప్రభుత్వ బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సామాన్యులకు ఈనెల 7 నుంచి, ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ఇప్పటికే పలు ఆసుపత్రుల బయట ప్రభుత్వ సిబ్బందికి చేసే ఈహెచ్ఎస్ వైద్యసేవలు లేదంటూ బోర్డులు పెట్టాశారు కూడా. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు అవమానంగా భావిస్తున్నారు. తమ డబ్బులు జీతం నుంచి పట్టుకున్న ప్రభుత్వం, వైద్యసేవలు అందించకపోవటంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

BRS: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... ఆ కీలక నేతతో పాటు మరికొందరు నేతల రాజీనామా

AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2024 | 03:00 PM