Share News

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారానికి సునీత..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:51 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు.

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారానికి సునీత..!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొండ్లి అసెంబ్లీ స్థానం నుంచి ఈ వారంతంలో ఎన్నికల ప్రచారానికి సునీత కేజ్రీవాల్ శ్రీకారం చుట్టనున్నారు.

Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్

ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది. దాంతో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఆప్ తన అభ్యర్థులను బరిలో దింపింది. అలాగే ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ.. తన అభ్యర్థులను రంగంలోకి దింపింది.

Bangalore: బెంగళూరు సహా 5 రైల్వే స్టేషన్లలో రూ.20కే జనతా భోజనం

దీంతో ఢిల్లీలోని లోక్‌సభ అభ్యర్థుల తరఫున సునీత ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అలాగే సునీత గుజరాత్, పంజాబ్‌ల్లో సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా సునీత పేరును ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన విషయం విధితమే.


మార్చి 21వ తేదీన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఇండియా కూటమి ఏర్పాటు చేసిన ర్యాలీల్లో సైతం సునీత పాల్గొంటున్నారు.

TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్‌కు నిరసనగా గత ఆదివారం.. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సునీత పాల్గొన్నారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వెళ్తుందని ఆరోపించారు.

Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్.. మోదీ హామీలను టార్గెట్ చేస్తూ.

కేజ్రీవాల్‌ను జైల్లోనే అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. అయితే మే 7వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Read National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 01:51 PM