Share News

AP Elections: మొబైల్ ఫోన్లతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లు.. పోలీసుల వైఫల్యం..

ABN , Publish Date - May 05 , 2024 | 12:49 PM

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

AP Elections: మొబైల్ ఫోన్లతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లు..  పోలీసుల వైఫల్యం..

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికలు (Elections) కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌ (Polling)కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ (Postal Ballot Voting) జరుగుతోంది. దీంతో ఉద్యోగులు (Employees) తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఓటర్ల వద్ద మొబైల్ అనుమతి ఉండకూడదు.. మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి తీసుకుపోకుండా తనిఖీ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. ఓటర్లు మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు. ఓటు వేసిన తర్వాత ఓటు ఎవరికి వేశామో ఫోటో తీసుకొని వెళ్లి చూపితే డబ్బులు ఇస్తామని పార్టీల నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్రిస్కింగ్ గాని, (మనుషుల్ని తాకి తనిఖీ) మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని పోలీసులు ప్రచారం చేయలేదు. ఓటు వేయడానికి వెళ్లే క్యూ లైన్‌లోనే ఫోన్ మాట్లాడుతూ క్యూ లైన్‌లో నిలబడి ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. హ్యాండ్ బ్యాగులు, బ్యాగుల తనిఖీలు కూడా చేయలేదు. ఎన్నికల సంఘం ఉత్తర్వులను పోలీసులు బేఖాతర చేస్తున్నారు. పోలీసుల తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి అని విపక్షాలు చర్చించుకుంటున్నాయి.


కాగా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballot) తొలిరోజునే ఉద్యోగులు కదం తొక్కడాన్ని గమనిస్తే వారు పూర్తిగా ఎటువైపు మొగ్గు చూపారన్నది నిగ్గు తేలుతోంది! టీడీపీ (Telugu Desam) కూటమికే ఉద్యోగులు బలంగా మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు తమ అంతరాత్మ సాక్షిగా నిర్ణయాత్మక తీర్పును వెలువరించబోతున్నారన్నది స్పష్టమౌతోంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వంపై (YSR Congress) ఉద్యోగులు రెండేళ్ల కిందటే మనసు విరిగిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం రోజునే ఉద్యోగులు కదం తొక్కటం కూటమికి లాభించబోతోందన్నది అర్ధమౌతోంది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 3 రోజుల పాటు దాదాపుగా 20వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 90శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు అర్థమౌతోంది. ఈ లెక్కన చూస్తే ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అర్థమౌతోంది. ఉద్యోగులే కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇదే వైఖరితో ఉండే అవకాశాలే ఎక్కువ.ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballot) తొలిరోజునే ఉద్యోగులు కదం తొక్కడాన్ని గమనిస్తే వారు పూర్తిగా ఎటువైపు మొగ్గు చూపారన్నది నిగ్గు తేలుతోంది! టీడీపీ (Telugu Desam) కూటమికే ఉద్యోగులు బలంగా మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు తమ అంతరాత్మ సాక్షిగా నిర్ణయాత్మక తీర్పును వెలువరించబోతున్నారన్నది స్పష్టమౌతోంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వంపై (YSR Congress) ఉద్యోగులు రెండేళ్ల కిందటే మనసు విరిగిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం రోజునే ఉద్యోగులు కదం తొక్కటం కూటమికి లాభించబోతోందన్నది అర్ధమౌతోంది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 3 రోజుల పాటు దాదాపుగా 20వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 90శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు అర్థమౌతోంది. ఈ లెక్కన చూస్తే ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అర్థమౌతోంది. ఉద్యోగులే కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇదే వైఖరితో ఉండే అవకాశాలే ఎక్కువ.


ఇదిగో లెక్కలివీ..!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 20వేల మంది ఉద్యోగులంటే 1.17 శాతం ఓటర్లే అనుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులను కనీసం ఇద్దరిని కలుపుకుంటే 4శాతానికి పెరుగుతుంది. ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే 3శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేయగలుగుతున్నారంటే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించుకునే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుంటా రు. వీరే కాకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సీపీఎస్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా భారీగా ఉంటారు. కుటుంబ సభ్యులే కాకుండానే వీరంతా 15వేల మంది వరకు ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిపి 45వేల మంది అవుతారు.


రైళ్లు పరిగెడుతున్నాయ్!

వీరంతా కలిపితే మరో 2.64 శాతం మంది ఉంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల 3శాతం, నాన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు కలిపి 2.64 శాతం మొత్తంగా 5.64 శాతం మేర ఉద్యోగులు ప్రభావితం చూపబోతున్నారన్నది స్పష్టంగా అర్థమౌతోంది. పోనీ మరో 1.64 శాతం కూడా తీసివేద్దాం. ఇలా చూసినా 4 శాతం మేర ఓట్లను ఎన్టీఆర్‌ జిల్లాలో ఉద్యోగులు ప్రభావితం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతం పెద్దగా తేడా ఏమీ లేదు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 4 శాతం ఓట్లను ఆయా పార్టీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలుగుతాయన్నది స్పష్టంగా అర్ధమౌతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలకు కదంతొక్కిన ఉద్యోగులను చూసి వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 12:56 PM