• Home » Vantalu

వంటలు

ఈ కాజాల కథ తెలుసా మీకు..

ఈ కాజాల కథ తెలుసా మీకు..

తెల్లగా ప్రవహించే గోదావరి పాయల్లా చుట్టుకున్న కమ్మనైన ఒక మిఠాయి, కాజా! పేరుని బట్టి మొగలాయీల వంటకం అనిపిస్తుంది గానీ ఇది భారతీయ పాక సంపదలో భాగమే! ప్రాకృతంలో ఖాద్య - ఖజ్జగా మారిన ‘ఖాద్యం’ ఈ ఖాజా! కమ్మగా తినదగినదని దీని భావం! రెండున్నర వేల యేళ్ల ఆహార చరిత్రను మడతలుగా చుట్టి మధురిమలు నింపుకుంది కాజా! క్రీ.పూ. 3వ శతాబ్దిలో మౌర్యుల కాలం నుండే కాజాలు తినేవారనటానికి ఆధారాలున్నాయి.

సుగంధ ద్రవ్యాలతో మజ్జిగ.. బోలెడు లాభాలు..

సుగంధ ద్రవ్యాలతో మజ్జిగ.. బోలెడు లాభాలు..

చల్లతో అన్నం పైలోకంలో పూర్వీకులు దిగివచ్చినంత కమ్మగా ఉండాలి. సాక్షాత్తూ అమ్మవారు ప్రత్యక్షమై తన చేతుల్తో కలిపి పెట్టినంత మధురంగా ఉండాలి. ‘సందేహం జనయతి సుధాయామతిరసః’ అది తింటే అమృతం కలిసిన అతిరసమా అని సందేహం కలగాలంటాడు పాకశాస్త్ర గ్రంథం క్షేమ కుతూహలంలో క్షేమశర్మ పండితుడు

ఇన్‏స్టంట్‎ గారెల గురించి తెలుసా.. పౌడర్ వచ్చేసిందోచ్

ఇన్‏స్టంట్‎ గారెల గురించి తెలుసా.. పౌడర్ వచ్చేసిందోచ్

ఒక చిన్న కథ చెప్పనా సరదాగా ... ఇవాళ, నిజంగా జరిగిందే! కబుర్ల కోసం చెపుతాను. పొద్దున్నే, వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసం, డబ్బాలో పోద్దామని, వెదుకుతూ వుంటే, ఆర్నెల్ల కిందట కొన్న ఒక గారెల పౌడరు ప్యాకెట్‌ దొరికింది.

చింతచిగురు - చింత చెదురు

చింతచిగురు - చింత చెదురు

వానాకాలపు సొగసును, ముసురుబడిన గగనాన్ని, రైతుల సహజ జీవనాన్ని రాజకవి రాయలవారు ఆముక్తమాల్యదలో ఇలా వర్ణించారు. గురుగు, చెంచలి, తుమ్మి, తమిరిశ, చింతచిగురుతో కూడిన ఐదాకుల కూర గురించి ఇందులో చెప్పారు.

విరిగిన పాలు జున్నులా తినొచ్చా..

విరిగిన పాలు జున్నులా తినొచ్చా..

పాలు సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయనప్పుడు, లేదా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు దానిలో స్వతహాగా ఉండే సూక్ష్మజీవులు కొన్ని రకాల ఆమ్లాలను (ఆసిడ్‌) తయారు చేస్తాయి. ఈ ఆమ్లాలతో పాటు వేడిచేసినప్పుడు పాలలో ఉండే ప్రొటీన్లలో జరిగే మార్పుల వలన పాలు విరగడం (లేదా పగలడం) జరుగుతుంది. పాలను వేడి చేయకముందే వాటి రంగు, వాసనలో తేడా వస్తే, వాటిని వాడకపోవడమే మంచిది. ఎక్కువ కాలం నిల్వ లేవు, వాసనలో కూడా మార్పు లేదు అనుకున్నప్పుడు... కాచిన పాలు విరిగితే దానిని కొంతమంది జున్నులా లేదా పనీర్‌లా వాడతారు.

Punugulu:  వర్షాకాలం.. స్పైసీగా ఇలా పునుగులు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు.!

Punugulu: వర్షాకాలం.. స్పైసీగా ఇలా పునుగులు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు.!

వర్షాకాలంలో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయట కాకుండా ఇంట్లో ఇలా పునుగులు చేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఓసారి ఇలా ట్రై చేసి తినండి.

కట్టావి అనే పెసరకట్టు...

కట్టావి అనే పెసరకట్టు...

1899 నాటి ‘తెలుగునాడు’ గ్రంథంలో మహాకవి దాసు శ్రీరాములు పద్యం ఇది. ఉడికీ ఉడకని మెతుకులు, అది పప్పో లేక నీళ్లో తేడా తెలియనట్టుగా నీళ్లోడుతున్న పప్పు, కాగి కాగని చారు (రసం), గరిటె నంటుకుని విదిల్చినా జారకుండా గట్టిగా ఉండే ‘కట్టావి పులుసుకూర’ని వడ్డించిందట.

Vantalu: ఈ వంటకాలు యమాటేస్ట్ గురూ..

Vantalu: ఈ వంటకాలు యమాటేస్ట్ గురూ..

1904లో హిందూ సుందరి పత్రికా సంపాదకులు సత్తిరాజు సీతారామయ్య గారు వంటలక్క అనే పుస్తకంలో ‘సుర్మాలాడూ’ అనే వంటకాన్ని వివరించారు. ఇది చూర్మాలడ్డూ అనే గుజరాతీ వంటకానికి తెలుగు రూపం కావచ్చు.

హరిత భోజన సౌందర్యం

హరిత భోజన సౌందర్యం

‘సలాడ్‌’ అనే లాటిన్‌ పదంలో ‘సాల్‌’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్‌’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు.

Vantalu: వేఢమిక అనే ప్రాచీన పరాటా..

Vantalu: వేఢమిక అనే ప్రాచీన పరాటా..

భావప్రకాశ అనే వైద్యగ్రంథంలో ‘వేఢమికా’ అనే వంటకం గురించి ఉంది. మినప్పిండిని గారెల పిండిలాగా గట్టిగా ముద్ద అయ్యేలా రుబ్బి గోధుమ పిండితో వత్తిన పూరీ మధ్య పూర్ణంలా వుంచి, మూసి బొబ్బట్టు వత్తినట్టు గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చినదివేఢమిక.



తాజా వార్తలు

మరిన్ని చదవండి