Home » YSRCP
పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలోని ఆంజనేయ స్వామి ఆలయ భూమిని వైసీపీ నేత వీరన్న స్వామి కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 3 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిన ఆయన, ఆలయానికి డబ్బులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.
జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కొన్ని జిల్లాల్లో GSDP పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలని తెలిపారు.
వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.