Home » Visakhapatnam
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం.. నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖలో ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు.
క్రీడల్లో ప్రపంచస్థాయి సంస్థను విశాఖపట్నంలో నిర్మించడమే తన లక్ష్యమని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రతిభకు కొదవ లేదని.. సరైన వేదికలే అవసరమని పేర్కొన్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు.
విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఓ మణిహారం. అక్కడ ఉద్యోగం అంటే జీవితానికి భరోసా. ఆ ఘనతంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు.. ఎప్పుడెప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేద్దామా అని ఉద్యోగులు ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. కొన్నేళ్ల నుంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఉద్యోగుల రాజీనామా పరంపర కొనసాగుతూ ఉంది.
గత ప్రభుత్వంలో నిబంధనల ఉల్లంఘన, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
భోగాపురంలో నిర్మించిన నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవ ఆహ్వానాల్లో అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ముఖ్యులైన వారికి ఆహ్వానపత్రాలు నేరుగా ఇవ్వలేదు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
విశాఖపట్నంలోని లంకెలపాలెం - అగనంపూడి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.