Share News

CM Chandrababu: అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:21 AM

సీఐఐ భాగస్వామ్య సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

CM Chandrababu: అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్
CM Chandrababu Naidu

విశాఖపట్నం, నవంబర్ 14: విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వస్తున్న అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ట్వీట్ చేశారు. VIZAGకు కొత్త నిర్వచనం ఇస్తూ సీఎం ఆహ్వానం పలికారు. V-Vision, I-Innovation, Z-Zeal, A-Aspiration, G-Growth అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించేలా భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు వెల్లడించారు.


చంద్రబాబు ట్వీట్

‘దార్శనికత. ఆవిష్కరణ. ఉత్సాహం. ఆశయం. వృద్ధి. ఇదే వైజాగ్‌కు నిర్వచనం. పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక అనే అంశాన్ని ప్రతిబింబించేలా... రెండు రోజుల పాటు సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అందరికీ అర్థమయ్యేలా... ఏపీలో ఉన్న అపార అవకాశాలను వివరించేలా భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నాం. అందరి సహకారాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన ప్రముఖులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను’ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

సాహసం చేసేద్దామా

ఓఎంసీ సుప్రీం కమిటీ నుంచి అనంత కలెక్టర్‌ తొలగింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 10:42 AM