Home » Vijayawada
రాజ్యాంగ వ్యవస్థను కొంతమంది తమ గుప్పెట్లో పెట్టుకుని దేశాన్ని ఫాసిస్టు శైలిలో పాలిస్తున్నారని సీపీఐ నేత కె. నారాయణ అన్నారు. విజయవాడలో రాఘవాచారి సంపాదకీయాల నాలుగో సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు
Mithun Reddy SIT Inquiry: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఎంపీని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.
SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ ఎంపీ వాంగ్మూలం కీలకం కానుంది.
ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు.. వీడియో ప్రదర్శించి 16వ ఆర్థిక సంఘం బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వివరించారు.
రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు.
రాష్ట్రంలో మరో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో కొత్త కాలేజీని ప్రభుత్వం అనుమతించింది
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వరయంలో 24 అంశాలు ఎజెండాగా మంత్రి మండలి సచివాలయంలో కీలక సమావేశం అయింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే ఈనెల 10వ తేదీన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయునుంది.
Former CJI NV Ramana: మాజీ సీజేఐ ఎన్వీ రమణ.. తన మొదటి జాబ్ గురించి మీడియాతో పంచుకున్నారు. ఒక వృత్తిగాని, ఉద్యోగం గానీ చేసినప్పుడు సరైనటువంటి గౌరవం ఉండాలని తెలిపారు.
AP Inter Results: మొదటి సంవత్సరం విద్యార్థులు 70 శాతం రెండో ఏడాది విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత నమోదైందని, ప్రభుత్వ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs)లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికమని అన్నారు.
Inter Results 2025: ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్‌లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.