Share News

ACB Court Orders: గోవిందప్పకుప్రత్యేక సదుపాయాలు

ABN , Publish Date - May 18 , 2025 | 04:31 AM

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.

ACB Court Orders: గోవిందప్పకుప్రత్యేక సదుపాయాలు

  • ఏసీబీ కోర్టు ఆదేశం

విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం ఆదేశాలు జారీచేశారు. తనకు ఏ లేదా బీ క్లాస్‌ బ్యారక్‌ కేటాయించాలని, ఇంటి నుంచి భోజన సదుపాయం, న్యాయవాదితో ములాఖత్‌లు పెంచాలని కోరుతూ గోవిందప్ప పిటిషన్‌ వేశారు. దీనిపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. గోవిందప్ప బాలాజీ నిద్రపోవడానికి మంచం, దిండు, దుప్పటి ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించే విషయంపై జైలు అధికారి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏ లేదా బీ క్లాస్‌ కేటగిరి బ్యారక్‌ను కేటాయించే అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేశారు.

Updated Date - May 18 , 2025 | 04:32 AM