Home » Videos
తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నివాసం ఎదుట గిరిజన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. టీడీపీకి చెందిన ఏఎమ్‌సీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి ని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంలో టీడీపీ చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వరుసగా షాక్ ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించేందుకు కొత్త విధానాన్ని తీసుకు వస్తున్నామన్నారు. అమెరికాలోని భారతీయులు.. ట్రావెలింగ్ సమయంలో కచ్చితంగా తమ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ సైతం వీసా ఫీజులను పెంచేసింది. దీంతో విదేశాల్లో సెటిల్ అవుదామనుకునే వారికి కష్టకాలం వచ్చేలా కనిపిస్తోంది.
కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దేవి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. అందులోభాగంగా బుధవారం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరి దేవికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన గుడిపల్లి మండలం అగస్త్య ఫౌండేషన్‌కు చేరుకున్నారు.
ట్రంప్ గోల్డ్ కార్డులకు భలే డిమాండ్. ఒక్కో కార్డు రూ. 44 కోట్లు ధర పెట్టినా.. ఒకే రోజులో వెయ్యి కార్డులు అమ్ముడు పోయాయి. అసలు అమెరికా పౌరసత్వం అంటే అంత క్రేజ్ ఎందుకు? గోల్డ్ కార్డులను మనవాళ్లే కొంటున్నారా?
తమ్మినేని సీతారాం గత అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. ఆయన ఎప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. ఆయన హయాంలో ప్రతిపక్ష పార్టీలను ఆయన ఛీదరించుకొన్న సంగతి అందరికి తెలిసిందే. సభలోని సభ్యులంతా ఒక్కటే అనే విధంగా ఉండాలి. కానీ ఆయనెప్పుడు అలా వ్యవహరించలేదు. సభలో సైతం స్పీకర్‌గా తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడిన విషయం తెలిసిందే.
అక్రమ దేశాలపైనే కాదు.. గిట్టని దేశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నారు. నాలుగు దేశాలకు చెందిన దాదాపు ఐదున్నర లక్షల మంది వీసాలను రద్దు చేశారు. అటు యూనివర్సిటీలపై ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు భయం భయంగా గడుపుతోన్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి.. వారిని స్వదేశాలకు పంపుతోన్న అమెరికా.. ఇప్పుడు తాత్కాలిక వలసదారులను ఇంటికి పంపిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి విడదల రజిని తన నియోజకవర్గంలో చేసిన హల్‌చల్‌ను టీడీపీ నేత సోదాహరణగా వివరించారు.విడదల గోపి, మంత్రి రజిని పీఏ రామకృష్ణ, ఫణింధ్రలు ముగ్గురు రాత్రి సమయంలో సూటు బూటు వేసుకొని పలువురిని భయాందోళనలకు గురి చేశారని చెప్పారు.
పోసాని కృష్ణమురళికి గుంటూరులోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్టయ్యారు. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. అందులోభాగంగా ఆయన అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్నారు. మార్చి 23 వరకు ఆయనకు రిమాండ్ విధించారు.
అగ్రరాజ్యంలో మరో భారతీయుడిపై బహిష్కరణ వేటు పడింది. హమాస్ సంస్థతో లింకులున్నాయనే నమోదైన అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే పరిశోధకుడిని భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో అతడిని భారత్‌కు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ.. బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో బాదర్ ఖాన్ పరిశోధకుడిగా ఉన్నారు.