Home » Venkaiah Naidu
'విజయవాడ ఉత్సవ్ 2025'ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అనేక విషయాల్ని పంచుకున్నారు. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ అవసరమని..
విజయవాడ చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్‌వేలో విజయవాడ ఉత్సవ్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక విషయాల్ని పంచుకున్నారు.
1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటిపై మనం పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా.. యాంటీ సోషల్‌గా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పని సరిగా చదవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశ శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి మరోమారు తెలిశాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారే శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు..