Home » Uttam Kumar Reddy Nalamada
శ్రీశైలం రిజర్వాయర్ భద్రతపై నిర్లక్ష్యాన్ని చూపినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ లీగల్ నోటీసులు పంపింది.
ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన (జీబీ లింక్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అడుకొంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్‌బీసీ పనులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులని కేటాయించామని అన్నారు. టన్నేల్ నిర్మాణంలో నిష్ణాతులైన వారి నియామకానికి కసరత్తు చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గోదావరిలో నీళ్లను ఇరు తెలుగు రాష్ట్రాలు వాడుతున్నాయని వివరించారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. ఇక్కడికి వచ్చిన నీటిని మరో బేసిన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కృష్ణాలో తక్కువగా ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
CR Patil meeting: సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనలో ఉంది. అందులో భాగంగా గురువారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రికి వివరించామని చెప్పారు.
Banakacharla Project: డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడ్డుకోవడంతో పాటు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు.
గోదావరి-బనకచర్లపై చివరి అస్త్రంగా న్యాయపోరాటం చేయాలని అఖిలపక్షం ఎంపీలు నిర్ణయించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం చొరవ, చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చారు.
పోలవరం-బనకచర్ల అనుసంధానం కోసం చేపట్టిన ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ అనుమతి ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని తెలంగాణ కోరింది.