Home » TTD
కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డి.. అర్హత లేని డెయిరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్ తెలిపింది.
తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి తయారీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఈ కేసులో ఏ 34 విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నారు.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం.. వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది.
తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వివరించారు.
వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.