Share News

టీటీడీ చైర్మన్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:57 AM

తిరుపతి హతిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

టీటీడీ చైర్మన్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతి హతిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి ఆమె గురువారం హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.


ఈనెల 30న హతిరామ్‌ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతోపాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. దీనిపై త్వరలోనే పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీఆర్‌ నాయుడు హామీ ఇచ్చినట్టు కవిత తెలిపారు.

Updated Date - Jun 20 , 2025 | 03:57 AM