Tirumala: టీటీడీకి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రూ.కోటి విరాళం
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:04 AM
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీకి రూ.కోటి విరాళంగా అందజేశారు.
తిరుమల, జూన్ 26(ఆంధ్రజ్యోతి): గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీకి రూ.కోటి విరాళంగా అందజేశారు. గురువారం తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్‌ను అందజేసి ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు వినియోగించాలని కోరారు. టీటీడీలోని పలు విభాగాల్లో ఐటీ సేవలను ఎలా మెరుగుపరచాలి, ఏఐ ద్వారా మరింత త్వరగా దర్శనం కల్పించడం ఎలా అనే అంశాలపై చంద్రశేఖర్‌తో, టీటీడీ చైర్మన్ చర్చించారు.