Home » Tollywood
తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.
జానీ త్రి గ్యూయెన్ పూరీ జగన్నాథ్ ఆస్థాన నటుడు. రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’తో భారత చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఏక్ నిరంజన్, బిజినెస్‌మ్యాన్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించాడు.
మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. తాజాగా మెగాస్టార్ ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు.
శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్‌పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్‌ను కోరినట్లు చెప్పారు
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పెయిర్ నిజ జీవితంలోనూ ఒక్కటవ్వనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికమందన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
సాహితీ ఇన్‌ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి నటుడు జగపతి బాబును ఈడీ విచారించింది.