Home » Tirupathi News
తిరుపతిలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన శుక్రవారం జరుగనుంది. పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఈ సమ్మిట్‌లో వివరించనున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
విహార యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లారు. అక్కడ నెలకొన్న అలర్ల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో చిక్కుకున్నారు. తిరిగి ఇళ్లు చేరగలమా అని ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. నేపాల్ నుంచి రప్పించింది.
తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.
‘నన్ను కులాంతర వివాహం చేసుకున్న శరత్‌కుమార్.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదు. కలెక్టరేట్ చుట్టూ నాలుగు పర్యాయాలు తిరిగినా న్యాయం జరగలేదు’ అంటూ ఇందు అనే మహిళ గన్నేరుపప్పు (విషపు కాయలు) తిని తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కు వచ్చారు.
స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం భారంగా కాకుండా, బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
నా పేరు స్రవంతి. మేము తిరుపతిలోని అశోక్‌నగర్‌లో ఉంటున్నాం. మా స్మార్టు రేషన్ కార్డు ఎక్కడ ఇస్తున్నారో తెలియక నాలుగు రోజులుగా జీవకోన, సత్యనారాయణ పురం, అశోక్‌నగర్, తుడా ఆఫీసు వద్ద వున్న సచివాలయాలకు వెళ్లి చూశాం. ఎవరిని అడిగినా సరైన సమాధానం లేదు.
తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను రాంగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.
తిరుమల ఆలయాన్ని 7(శనివారం)వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి ఆదివారం వేకువజామున 3 గంటల వరకు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది.