Home » Tirumala
అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందాయి.
తిరుమల ఆలయాన్ని 7(శనివారం)వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి ఆదివారం వేకువజామున 3 గంటల వరకు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది.
తిరుపతి-తిరుమల నడుమ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు చేసిన ప్రకటన మహిళా యాత్రికులను మహదానందానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉచితంగానే తిరుపతికి చేరుకున్నా తిరుమలకు మాత్రం చార్జీలు చెల్లించాల్సిరావడం వీరిని అసంతృప్తికి గురిచేసింది. తాజా నిర్ణయం అమలు తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి తిరుమలకు ఉచితం చేయడం వల్ల ఆర్టీసీ మీద పడే భారం కూడా ఏమంత ఎక్కువ కాదు.
వచ్చేనెల మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
తిరుమలలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా స్పష్టించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న ఏటీఎంలోకి ప్రవేశించిన అతడు పలుచోట్ల వైర్లను కట్ చేశాడు. అనంతరం ఏటీఎం మిషన్ చుట్టూ అనుమానాస్పదంగా తిరిగాడు.
లిక్కర్ కేసులో నిందితుడు ఎంపీ మిథున్రెడ్డి ఆరోగ్యం బాగుండాలని తిరుమలకు పాదయాత్రగా వస్తున్న వైసీపీ కార్యకర్తలనుచంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడు సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు.