Share News

తిరుమల అడవుల్లో అరుదైన బల్లి

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:59 PM

అరుదైన బల్లిజాతిని గుర్తించారు.

తిరుమల అడవుల్లో అరుదైన బల్లి

అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండల్లో అరుదైన ఒక బల్లిజాతిని గుర్తించారు. దట్టమైన చందనపు అడవిలో చెట్టు బెరడు కింద దీనిని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి వెంకటాద్రి స్లెండర్‌ గెక్కో అని పేరు కూడా పెట్టారు. పలుచని తొండలా కనిపించే బల్లిజాతి జీవి ఇది. హెర్పటోజోవా అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఈ వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్రెష్‌వాటర్‌ బయాలజీ రీజనల్‌ సెంటర్‌, కోల్‌కత్తకి చెందిన రెప్టిల్లా విభాగం, ఓడిస్సాలోని ఫకీర్‌ మోహన్‌ యూనివర్శిటీల శాస్త్రవేత్తల బృందం శేషాచలం అడవుల్లో దీనిని గుర్తించింది.

ఇవి కూడా చదవండి..

United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ

Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ

Updated Date - Oct 29 , 2025 | 10:57 AM