Home » Tirumala
తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.గోపాలకృష్ణారావు మరియు జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి దర్శనంలో పాల్గొని ఆశీర్వచనం పొందారు
యుద్ధ ఉద్రిక్తతల భయంతో తిరుమలకు భక్తుల రాక సాధారణ స్థాయిలోనే ఉంది. వేసవి సెలవుల్లో కూడా క్యూకాంప్లెక్స్లు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది
తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఆక్టోపస్ బలగాలు ఉగ్రవాద దాడులకు సమాధానంగా మాక్‌డ్రిల్ నిర్వహించాయి. భక్తుల రక్షణ కోసం ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు.
గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో 12మందిపై తొలి చార్జిషీటును సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మరో పది రోజుల్లో రెండో చార్జిషీటు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనంతో లడ్డూ ప్రసాదాలు స్వీకరించారు
అలిపిరిలోని 35 ఎకరాల భూమిని టీటీడీ ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించగా, పేరూరు గ్రామంలోని 10.32 ఎకరాలు సహా మొత్తం 35 ఎకరాలను టీటీడీకి బదలాయించాలని బోర్డు నిర్ణయించింది. ఈ భూకదలికకు సంబంధించి ప్రభుత్వాన్ని వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయనుంది
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనున్నారు. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక రేఖాడి చైత్ర 15 నిమిషాల పాటు యోగాసనాలు వేయగా భక్తులు ఆశ్చర్యపోయారు.యోగాలో జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలన్న లక్ష్యంతో ఆమె సాధన కొనసాగుతోంది.